సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్థానిక డి యాన్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బేసిక్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ అధర్వర్యంలో ఫస్ట్ ఇయర్ బీటెక్ మరియు పాలిటెక్నిక్ విద్యార్థులుకు infinito అనే సాంకేతిక మరియు సాంస్కృతిక వేడుకలను కళాశాలలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు బహుమతి ప్రధానం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి, గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) మాట్లాడుతూ.. విద్యార్థులు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం నుండే భావవేక్తికరణ ,ప్రాజెక్ట్ ఎక్స్పో మరియు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ను మెరుగు పరచటం కోసం ఈ యొక్క ఫెస్ట్ ను నిర్వహించామని తెలిపారు. ఈ ఈవెంట్లో మా కళాశాల విద్యార్థులతోపాటుగా వివిధ కళాశాల విద్యార్థులు ఈ ఫెస్ట్ లో హాజరుయారు అని, విద్యార్థులలో ఉన్న సృజనాత్మకత ను వేలుకుతియ్యటం కొరకు మరియు వారిలో ఆత్మ విశ్వాసం ను పెంపొందించటం ద్వారా వారి భవిషత్లో ఉద్యోగ సాధించడం సులభం తరం అవుతుందని ఇంజనీరింగ్ విద్యార్థులు మార్కులతో పాటుగా విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని ,సమాజంలో మానవుల అవసరాలకు ,అభిరుచులకు తగట్టుగా నూతన ఆవిష్కరణలను చేసేటటుగా విద్యార్థులు కృషిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో, కళాశాల జాయింట్ సెక్రటరీ, కే .శివరామరాజు,కళాశాల ప్రిన్సిపాల్ డా. యం అంజాన్ కుమార్,బేసిక్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ విభాగ అధిపతి డా. జి .జి రత్నం, వైస్ ప్రిన్సిపాల్ డా .బి.వి యస్ వర్మ , A O ఫణి కుమార్ మరియు వివిధ విభాగలా అధిపతులు కోఆర్డినేటర్స్ గా శ్రీ వి.ప్రవీణ్ , బి మేషక్ రాజు,జి .మెసేజ్ పాల్గొన్నారు.
