సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం, తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో 14 ఏళ్ళు సీఎంగా చేసిన ఏకైక వ్యక్తి, మరో 15 ఏళ్ళు ప్రతిపక్ష నేత గా సుదీర్ఘ రాజకీయ జీవితం చుసిన రాజకీయ చాణుక్యుడు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు 75వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు రాష్ట్రాల నుండి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటు రాజకీయ ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలియ జేస్తున్నారు. ఆయన నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకొంటూ.. కుప్పంలో ఆయన భార్య భువనేశ్వరి కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ ను కట్ చేసి వేడుకలు జరిపారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్.. చంద్రబాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా, పరిపాలనాపరంగా అనుభవజ్ఞులైన చంద్రబాబు గారు నిరంతం రాష్ట్రం గురించే ఆలోచన చేస్తారన్నారు.
