సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, మంగళవారం ఉదయం నుండి హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని మారుతీసెంటర్, సుంకరపద్దయ్య వీధిలోని 30 అడుగుల విగ్రహం గుడి వద్ద,గునుపూడి పంచారామం లోని శ్రీ ఆంజనేయ స్వామి ఉప ఆలయంలో ( ఫై ఫోటో) రాయలం లోని 20 అడుగుల హనుమాన్ విగ్రహం గుడి వద్ద, అన్ని రామాలయాల వద్ద కేసరి నందన పూజలు, పుష్ప అలంకారాలతో భక్తులతో సందడిగా మారాయి. పలు దేవాలయాల వద్ద అన్నసమారాధన లు ఏర్పటు చేసారు. నేటి తెల్లవారుజాము నుంచే హనుమాన్ ఆలయాలకు భక్తులు తరలివెళ్తున్నారు. ముఖ్యంగా నందమూరు గురువు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద భారీ క్యూ లైన్ ల భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భముగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిగ్మా ఆన్ లైన్ న్యూస్ వీక్షకులకు .. శ్రీరామ భక్త హనుమాన్ భక్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
