సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా గత 2019 భీమవరంలో మెగా కుటుంబం వాడవాడలా ప్రచారం చేసిన తీరులోనే పిఠాపురం లో కూడా ఆయనకు మద్దతుగా నిలిచే సూచనలు ఉన్నాయి. అయితే మే 5 నుండి అన్నయ్య చిరంజీవి కూడా ప్రచారంలోకి దిగుతారని భావిస్తుండగానే.. అనుకోని విధంగా నాగబాబు తనయుడు సినీనటుడు వరుణ్ తేజ్ రేపటి శనివారం నుండి పీఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది.గొల్లప్రోలు రూరల్ మం డలం తాటిపర్తిలో మధ్యా హ్నం 3 గంటలకు వరుణ్తేజ్ ప్రచారం ప్రారంభం కానుంది. వన్నెపూడి మీదుగా కొడవలి, చందుర్తి, దుర్గాడ మీదుగా కొనసాగనుంది. భీమవరం తాడేపల్లి గూడెం, నరసాపురంలో కూడా వరుణ్ తేజ్ జనసేన అభ్యర్థుల తరపున ప్రచారం చేసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *