సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎండల వేడిమికి , వడగాల్పుల తీవ్రత కు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో ఉన్న రాజకీయ నేతలు వారి అనుచరుల పరిస్థితి వేరే చెప్పనక్కరలేదు. అయితే రానున్న మరో 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వడగాల్పుల తీవ్రత అధికం అవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఏపీలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 నుండి 45 డిగ్రీలు సగటున నమోదు అవుతున్నాయి. రాయలసీమ జిల్లాలలో వడగాలులు వీస్తున్నాయి. కోస్తాంధ్ర, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎండ తో పాటు తీవ్ర ఉక్కపోత వాతావరణం ఉంది. మరో 5 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
