సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఎన్నికల వేడి రాజుకొంటుంది. ఇంకా ఎన్నికలకు ప్రచార సమయం పట్టుమని 16 రోజులు.. వైసీపీ తరపున బస్సు యాత్రతో సీఎం జగన్ ఒక పర్యాయం రాష్ట్ర పర్యటన పూర్తీ చేసారు. ఇక కూటమి తరపున ఇప్పటికే చంద్రబాబు పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంకా కూటమికి ఊపు రావాలంటే ప్రధాని మోడీ , అమిత్ షా ఏపీలో పర్యటించవలసి ఉంది. దానికి షెడ్యూలు సిద్ధం అవుతుందని సమాచారం. మే నెల మొదటి వారంలో బహుశా 2, 3 తేదీలలో భీమవరం , రాజమండ్రి, విజయవాడ, తదితర ప్రాంతాలలో ప్రధాని మోడీ, లేదా అమిత్ షా బహిరంగ సభల ఏర్పాటు జరిగే అవకాశం ? వారితో పాటు ఒకే వేదికపై చంద్రబాబు, పవన్ కూడా పాల్గొంటారని సమాచారం… దీనితో ఆయా ప్రాంతాలలో పోటీ చేస్తున్న లోక్ సభ, అసెంబ్లీ స్థానాలలో కూటమి పార్టీల అభ్యర్థులలో కొత్త జోష్ వస్తుందని ఆయా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే వారి పర్యటనలో సీఎం జగన్ ప్రభుత్వం ఫై ఈసారైనా విమర్శల వర్షం పడుతుందా? అంటే మిలియన్ డాలర్స్ ప్రశ్న ?
