సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాలకొల్లు క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో నేటి సోమవారం ఉదయం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన నరసాపురం పార్లమెంటు బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ సభికులతో మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి వేలకోట్లు ఉన్న వారు సిద్ధంగా ఉన్నప్పటికీ ఒక సామాన్యుడు రాజకీయం చేయగలడని నిరూపించడానికి నరేంద్ర మోడీ నాకు ఈ సీటు కేటాయించారు.. నేను బిజెపిలో ఒక సామాన్య కార్యకర్తగా ప్రారంభించి 34 సంవత్సరాలుగా పార్టీలో కష్టపడినందుకు ఈ గౌరవం లభించిందని, అందరి సహకారంతో బిజెపి టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థిగా విజయం సాధిస్తానని అన్నారు. తాను భీమవరం లో నివాసం ఉంటున్నప్పటికీ ఈ ప్రాంతానికి చెందిన వాడిని గుర్తు చేశారు. తన అమ్మమ్మ గారి ఊరు జున్నూరు గ్రామo అని, తన నానమ్మ ఊరు బగేశ్వరం గ్రామము అని చెప్పారు చెప్పారు. తాను సామాన్య నాయకుడినని తన వద్ద కోట్ల ఆస్తి లేదని, అయితే ప్రజల అభిమానాన్ని మాత్రం సంపాదించి వారిసంక్షేమం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ప్రజల మనిషిగా ప్రతినిత్యం వారి మధ్యనే తిరుగుతూ వారికోసం ఎంతో కష్టపడుతున్నారని ,తాను కూడా అలాగే కష్టపడి ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు.తమకు ఎన్నికలలో మద్దతు ఇచ్చి విజయానకి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
