సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికల ప్రచార భేరీలో భాగంగా రెండో రోజు సోమవారం అనకాపల్లి జిల్లా చోడవరం కొత్తూరు జంక్షన్లో నిర్వహించిన ప్రచార సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘జగన్కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి. పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. అంటే.. మళ్లీ మోసపోవడమే. చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం ఇది. ప్రజలు చంద్రబాబుని నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టినట్లే ని సీఎం జగన్మోహన్ రెడ్డి అ‍న్నారు. జరగబోయే ఎన్నికలు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేవి మాత్రమే కాదు.. ఇంటింటి అభివృద్ధి,ద్ధిపేదల తలరాతల్ని నిర్ణయిస్తాయి. ఎలానూ అధికారంలోకి రానన్న నమ్మకంతో మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు. ఒక బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమవుతుంది?.. గోవిందా.. గోవిందా.. ఇది ఆ తిరుపతిలో స్వామివారికి చెప్పే గోవిందా.. గోవిందా కాదు. చంద్రబాబు మోసానికి ప్రజలు ఎంతలా అతలాకుతలం అయ్యారో చెప్పే.. గోవిందా.. గోవిందా. గతంలో రుణమాఫీ అంటూరైతుల్ని మోసం చేశారు. డ్వాక్రా రుణమాఫీల పేరుతో మహిళలను మోసం చేశారు. 2014 ఎన్నికలకు ముందు జాబ్ రావాలంటే బాబు రావాలంటూ యువతను మోసం చేశారు. తన పాలనలో చంద్రబాబు కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మన గ్రాఫిక్స్ రాజధాని గోవిందా… అభివృద్ధి-సంక్షేమాల విషయంలో గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గమనించి జాగ్రత్తగాత్త ఓటేయాలని, సీఎం జగన్, చోడవరం వేదికగా ప్రజలకు పిలుపు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *