సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ లో అఫిలియేషన్ లో పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని డిగ్రీ కళాశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న edex కోర్సులకు సంబంధించి ప్రాంతీయ సమీక్ష సమావేశం నేడు, శనివారం భీమవరం డి.ఎన్.ఆర్ కళాశాలలో జరిగింది. ప్రొఫెసర్ బి. జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. Edex కోర్సుల ప్రాధాన్యత పై ఆయన విపులంగా చర్చించారు. డి. ఎన్.ఆర్ కళాశాల కార్యదర్శి జి. సత్యనారాయణ రాజు (బాబు గారు), వైస్ ప్రసిడెంట్ జి. పాండు రంగరాజు Edex కోర్సుల నిర్వహణపై విద్యార్థులకు కలిగే ప్రయోజనాల ను మరింత విశదంగా అడిగి తెలుసుకొని తమ సంతృప్తిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బి.ఎస్. శాంత కుమారి, పాలకవర్గ సభ్యుడు మరియు విశ్రాంతి ప్రిన్సిపాల్ పి. రామకృష్ణo రాజు వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.
