సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, సోమవారం ఉదయం నుండి తాడేరు, బేతపూడి, తుందురు, జొన్నల గురువు లలో విస్తృతంగా అభిమానులు వైసీపీ శ్రేణులతో కలసి ప్రచారం నిర్వహించారు. స్థానిక వైసీపీ శ్రేణులు యువత మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తాడేరు ప్రాంతంలో నామన మహేష్ వారి మేనల్లుళ్లు చేతులలో హారతి కర్పూరాలు వెలిగించుకుని ఆయనకు స్వాగతం పలకడం అందరితో పాటు ఆయనను దిగ్బ్రాంతి పరచింది. ఆయన వారిని వారించగా .. మీరు మా ప్రాంతానికి చేసిన అభివృద్ధి , మేలు ముందు ఇదెంత అన్న? మా తాడేరుకు దశాబ్దం పైగా ఏ నేత పట్టించుకోకపోతే పూనుకొని తాడేరు కు కొత్త వంతెన ను 2 కోట్ల రూపాయలపైగా నిదులతో నిర్మించి ఇచ్చారు. ఇప్పుడు భీమవరం మండలంలో అన్ని గ్రామాల ప్రజలు ఈ కొత్త వంతెన మీదనుండి సురక్షితంగా భీమవరం వస్తున్నారంటే మీ సంకల్పం వల్లనే.. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మిమ్మలిని మరోసారి భారీ మెజారిటీతో గెలిపించుకొంటాం అంటూ .. ఆ యువకులు చేతులు కాలుతున్న హారతి పూర్తిచేశారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఉత్సహ పూరిత వాతావరణంలో ప్రచారం ముందుకు సాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *