సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన పార్టీ తరపున కూటమి అభ్యర్థి గా పోటీ చేస్తున్న పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), నరసాపురం అసెంబ్లీ జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయక్, మరియు జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవింద్ బాబు, భీమవరం మండలం తీరప్రాంతాలయిన తోకతిప్ప, కోటూట్లపాడు, జి లొసరి దొంగపిండిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.పలు గ్రామాలలో కూటమి కార్యకర్తలు , మహిళలు ఆయనకు స్వగతం పలికారు. ఈ సందర్భముగా అయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో భీమవరం లోను ఎన్డీయే కూటమి అభ్యర్థులే గెలుస్తారని, ధీమా వ్యక్తం చేసారు. కూటమి ప్రభుత్వం వచ్చాక భీమవరం తీరా ప్రాంత మత్యకార కుటుంబాలను అన్ని విధాలా అదుకొంటామని, గృహ సౌకర్యం, మంచినీటి సమస్య పరిష్కరిస్తానని , మత్యకార పింఛనులు, వృద్దులకు నెలకు 4 వేల చప్పున పింఛను , మహిళలకు ఉచిత బస్ సౌకర్యాలు కల్పిస్తానని హామీలు ఇచ్చారు. గ్రామాలు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.
