సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇంటర్ తరువాత, అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజనీరింగ్ కోర్స్ లలో చేరే విద్యార్థుల కోసం ఈఏపీ సెట్–2024 పరీక్షలు నేటి గురువారం నుంచి ప్రారంభం అయ్యాయి. 16, 17 తేదీలలో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష, 18 నుంచి 23వ తేదీ వరకు ఇంజనీరింగ్ పరీక్ష జరగనుంది. భీమవరంలో నాలుగు పరీక్ష కేంద్రాలు, తాడేపల్లిగూడెంలో రెండు, నర్సాపురంలో ఒక కేంద్రంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షకు 4,087 మంది, ఇంజనీరింగ్ పరీక్షకు 9,928 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఉదయం సెషన్‌లో తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వరకు రెండో సెషన్‌లోను పరీక్షలు జరుగుతున్నాయి. . పరీక్ష సమయానికి గంట ముందు నుంచి పరీక్ష హాలులోకి పంపిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు అని నిర్వాహకులు ప్రకటించారు. . పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్, కాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రికల్ వస్తువులు తీసుకువెళ్లనివ్వరు.
