సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: D.N.R కళాశాలలో ప్రాంగణ నియామకాలు 2023 -2024 విధ్య సంవత్సరం నకు సంబంధించి ప్రాంగణ నియామకాలు ప్లేస్ మెంట్ సెల్ ఆధ్వర్యంలో గత 20 రోజులు నుండి జరుగుచున్న వని కళాశాల ప్రిన్సిపాల్ Dr. B.S శాంతా కుమారి మాట్లాడుతూ.. కాలేజీ మొత్తము మీద 309 మంది డిగ్రీ మరియు P.G విధ్యార్ధులు నియామకాలు పొందినట్లు తెలిపారు. ఉద్యొగ నియామకాలు పొందిన విద్యార్థిని విధ్యార్ధులకు కళాశాల వైస్ ప్రెసిడెంట్ , గోకరాజు పాండు రంగా రాజు ఆధ్వర్యంలో నియామక పత్రాలు పంపిణీ చేసారు ఇందులో 60 మంది విధ్యార్ధులు MSN ల్యాబ్ , ఆరబిందో, హెటరో వంటి ఫార్మా కంపెనీలలో, D.F.C.L కంపెనీలో 24 మంది కెమిస్త్రీ విధ్యార్ధులు నియామకాలు పొందారని, ఇంకా శ్రీ సిటీ EPACK (ఇపాక్) కంపెనీలలో 22 మంది కి నియామకాలు జరిగాయని THINKSYNQ , Connect , Hexaware , Fusion CX (ఫ్యూజన్ సి ఎక్స్) , All Sec (అల్ సెక్ ), skill dunia (స్కిల్ దునియా), technotask(టెక్నోటాస్క్) , all set (అల్ సెట్) , INNOV (ఇన్నవో) వంటి ప్రఖ్యాత కంపెనీలలో 199 మంది ఎంపిక అయ్యారు. మరలా paytm , ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలలో 5 గురు విధ్యార్ధులు ఎంపిక అయ్యారు. D.N.R కళాశాలలో చదువుచున్న ప్రతి డిగ్రీ , P.G విధ్యార్ధుల కి పట్టాతో పాటుగా ఉద్యోగము కూడా ఇప్పించే విధముగా కళాశాల యాజమాన్యం పని చేస్తున్నట్లు కళాశాల ప్రెసిడెంట్ G.V నరసింహ రాజు, కళాశాల కార్యదర్శి G సత్యనారాయణ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. పాలక మండలి సభ్యులు P. రామకృష్ణం రాజు నియామకాలు పొందిన విద్యార్థిని విధ్యార్ధులకు అభినందనలుతెలిపారు.
