సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం DNR ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ఈనెల 30నుంచి 4 రోజుల పాటు జూన్ 2వ తేదీవరకు జరగనున్న చైతన్య భారతి 17వ జాతీయ స్థాయి నాటిక పోటీలు నేడు, గురువారం సాయంత్రం చైతన్య భారతి నాటక పరిషత్ అధ్యక్షులు రాయప్రోలు భగవాన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. అనేక వ్యయ ప్రయాసలకోర్చి ప్రత్యేక కళావేదిక ను ఏర్పాటు చేసారు. గత 17 ఏళ్లుగా లక్షలాది రూపాయలు ఖర్చుతో ఇంత గొప్ప స్థాయిలో జాతీయ స్థాయిలో సాంఘిక నాటకాల పోటీలను నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. నాటక కళ సజీవం చేస్తున్న కళాకారులను అభినందించారు.వేదికపై శత సినిమాల నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణకు ఆత్మీయ చైతన్య పురస్కారం, రంగస్థల నటులు, నాటక రచయిత డా పురాణం వెంకట రామ్ కుమార్ కు జవ్వాది రంగస్థల చైతన్య పురస్కారం, రంగస్థల నటులు దర్శకులు జనాబ్ ఎస్ఎం భాషాకు మైనంపాటి రంగనాయకులు రంగస్థల చైతన్య పురస్కారాలతో సత్కరించారు. అనంతరం గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి “మూల్యం” నాటక ప్రదర్శన ప్రారంభించారు. కళావేదికను చైతన్య భారతి సభ్యులు రాయప్రోలు శ్రీనివాసమూర్తి, భట్టిప్రోలు శ్రీనివాసరావు (BSR ) పేరిచర్ల లక్ష్మణ వర్మ, కట్రేడ్డి సత్యనారాయణ, అప్పారావు,భాషా తదితరులు పర్యవేక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *