సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం పట్టణం 2 టౌన్ లో ని ఎస్ ఆర్ కే ఆర్ మరియు విష్ణు ఇంజనీరింగ్ కళాశాలల స్ట్రాంగ్ రూమ్ లలో జిల్లాలో 7 శాసన సభ మరియు నరసాపురం లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు, వీవీ ప్యా డ్లు భద్రపరిచిన నేపథ్యంలో ఆ 2 కాలేజీ ల పరిసర ప్రాంతాలను నో ఫ్లైజోన్ లుగా ప్రకటించినట్లు ఎస్పీ వేజెండ్ల అజిత ప్రకటించారు. ఆయా స్ట్రాం గ్ రూమ్స్ పరిసర ప్రాంతాలలో ఈ నెల 5వ తేదీ వరకు ఎవరు డ్రోన్లు ఎగరవేయడానికి ఎవరికి ఎటువంటి అనుమతులు లేవని, ఎవరైనా నిబంధనలకు విరుద్ధం గా డ్రోన్లు వినియోగిస్తే వారిపై చట్టప్రట్ట కారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అజిత హెచ్చరించారు. ఎవరైనా డ్రోన్ ఉపయోగించాలంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ప్రకటించారు
