సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ రోజు మే 31 వ తేదీ మహా మనిషి, స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ 81వ పుట్టిన రోజు.. భీమవరం తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అయన అభిమానులు నేడు, శుక్రవారం వేడుకలు అన్నసమారాధనలు పేదలకు వస్త్ర దానాలు నిర్వహిస్తున్నారు. అయన వీర అభిమానులు రాజకీయాలలో కూడా సంచలనాలు సృష్టిస్తారు. కొండను సైతం ఢీ కొట్టే మనస్తత్వం కలిగి ఉంటారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి క్రిషన్ రెడ్డి, మాజీ మంత్రి తలసాని, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ఎంపీ రఘురామా కృష్ణంరాజు ఇలా ఎందరికో ఆయన స్ఫూర్తి.. అయన తెలుగు వారికే కాదు భారతీయ సినీ పరిశ్రమకు కృష్ణ ఒక బాహుబలి. మరల అటువంటి వ్యక్తి పుట్టాడేమో? తెలుగు సినీ లెజెండ్ ..భారతీయ సినీ చరిత్రలో 2500 అభిమాన సంఘాలతో వీరాభిమానులు ను సంపాదించుకొన్న ఏకైక హీరో కృష్ణ మాత్రమే.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే కాదు ప్రపంచ చరిత్రలో ఏ సినీ హీరో, ఏ సినీ ప్రముఖుడు సాధించని అద్భుతాలు ఎన్నో చేసిన వ్యక్తి. ఎన్నో వేల మందికి ఉపాధిని కల్పించిన ధీరుడు.. హీరో కృష్ణ , నిర్మాతగా, దర్శకుడుగా, స్టూడియో అధినేతగా, థియేటర్స్ నిర్వాహకుడిగా, సినిమాల డిస్ట్రిబ్యూటర్స్ గా, హిందీ సినిమాలు దక్షిణా భారతంలో విడుదల చేసే డిస్ట్రిబ్యూటర్లుగా, భారతీయ టివి సీరియల్స్ లో సైతం నిర్మాతగా, హీరోగా , ఇంకా రాజకీయాలలో తన అభిమాన హీరో ఎన్టీఆర్ ను సైతం ఢీ కొట్టిన సాహసి కృష్ణ. ఏలూరు లోక్ సభకు ఎంపీగా ఎన్నికయి .. ఇలా అందులేడు .. ఇందులేడు అన్నరీతిలో సాహసానికి చిరునామాగా మారిపోయారు సూపర్ స్టార్ కృష్ణ.. భారతీయ సినిమా పరిశ్రమకు పాన్ ఇండియా వ్యాపార సూత్రాలు నేర్పిన ఘనుడు కృష్ణ మాత్రమే.. 37 ఏళ్ళ క్రితమే హీరో కృష్ణ డ్యూయల్ రోల్, ఎడిటింగ్, కధ , కధనం, నిర్మాత, దర్శకుడిగా భారీ సెటింగ్స్, 6ట్రాక్ స్టీరియో పోనిక్ సిస్టం, 70 ఎం ఎం లో నిర్మించిన సింహాసనం శాటిలైట్ టెలికాస్ట్ లేని ఆ రోజులలో ఒక్కక్క ప్రింటు కు 2న్నర లక్షల ఖర్చు చేసి దేశవ్యాప్తంగా, లండన్ లోను ఒకేసారి రిలీజ్ చేసిన ఘనుడు కృష్ణ, మోసగాళ్లకు మోసగాడు ఇంగ్లిష్ లో ‘ట్రెజరర్ హంట్’ పేరుతొ హాలీవుడ్ సినిమాగా దాదాపు 60 విదేశాలలో 1ప్రదర్శింపబడింది. తోలి సినిమా స్కోప్ .. అల్లూరి సీతారామరాజు, ఆ సినిమా టేకింగ్, నిర్మాణ స్థాయి చుస్తే ఇప్పటికి మతిపోతుంది. ఆయన సినిమాలు కేవలం 2 నెలలు లో నిర్మించిన చిత్రాలు అంటే ఎవ్వరు నమ్మరు. కృష్ణ .. కురుక్షేత్రం కర్ణాటకలో డబ్బింగ్ చెయ్యకుండానే అక్కడ 15సెంటర్స్ లో 100 రోజులు ఆడిన పాన్ ఇండియా దిగ్గజం. 350 చిత్రాలలో హీరోగా నటించిన ఏకైక భారతీయ సినీ హీరో కృష్ణ. ఆయన కార్యదక్షత, సాహసం తెలుగువారి గుండెలలో ఎప్పుడు సజీవమే..

  1. ↩︎

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *