సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ రోజు శుక్రవారం 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇవన్నీ బడ్జెట్ తెలుగు సినిమాలు అయినప్పటికీ అంతో ఇంతో అంచనాలు ఉన్నాయి. సరైన సినిమాలు లేక సబ్డు గా ఉన్న సినిమా థియేటర్స్ లో కాస్త సీట్ల దుమ్ము దూలపడానికి పనికి వస్తాయి. వీటిలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్ అఫ్ గోదావరి ఫై మంచి అంచనాలు ఉన్నాయి. 1990 దశకం లో ఒక చిల్లర దొంగ గ్రామంలో ఒక మోతుబరి కూతురిని ప్రేమించి అతనిని ఢీ కొట్టే కధనం తో పాత సినిమాల వాసనలతో తయారు అయిన ఈ సినిమా ఒక మోస్తరు టాక్ లో ఉంది. అలానే యూవీ క్రియేషన్ సమర్పణలో కార్తికేయ హీరోగా భజే వాయువేగం సినిమా కూడా రిచ్ గా నిర్మించారని కాలక్షేపానికి డోకాలేదని టాక్.. ఇక బేబీ లాంటి ఘనవిజయం తరువాత ఆనంద దేవర కొండా హీరోగా గమ్ గమ్ గణేశా సినిమా వినోదాత్మకంగా ఉందని టాక్ .. వెన్నెల కిషోర్ కామిడి అదుర్స్.. హీరో దొంగిలించిన వజ్రం ను ఒక వినాయకుడి ప్రతిమలో పడిపోవడం దాన్ని పట్టుకొనే చేజింగ్స్ తో ఫన్నీగా కధ నడుస్తుంది. మంచి కాలక్షేపానికి డోకా లేదు..
