సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ తో జట్టు కట్టి ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ నెల తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజు ఉదయం 11.53 గంటలకు ఆయన పదవీప్రమాణం చేస్తారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. .చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. 1995లో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా మొదటిసారి, 1999 ఎన్నికల్లో గెలిచి రెండోసారి సీఎం మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఎన్నికల్లో గెలిచి మూడోసారి సీఎంగా ప్రమాణం చేశారు. దానిని కూడా పరిశీలిస్తున్నారు. విజయవాడ-గుంటూరు జాతీయ రహదారి పక్కన అనువైన మైదానం కోసం టీడీపీ నేతలు అన్వేషిస్తున్నారు.కాగా..చంద్ర బాబును లాంఛనంగా కూటమి నేతగా ఎన్నుకోవడానికి టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీల ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏడో తేదీన నిర్వహించే అవకాశం ఉంది… చంద్రబాబు జనసేనాని పవన్ కల్యాణ్ కలసి నేడు, బుధవారం ఢిల్లీ వెళుతున్నారు. కేంద్రంలో బీజేపీ కి స్వతంత్రంగా పూర్తీ బలం లేకున్నా ఎన్డీయే కూటమి బలంలో ఈసారి మోడీ ప్రధానిగా మూడవసారి అధికారంలోకి రావడం ఖాయం అయ్యింది.
