సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ దారుణంగా ఓటమి పాలైంది. దీంతో ఎన్నికల ప్రచార సమయంలో హద్దులు మీరిన సవాళ్లకు నాయకులూ దిగారు. ఈ నేపథ్యంలోతాను చేసిన సవాల్ ను నిలబెట్టుకొంటూ దశాబ్దాలుగా కాపు జాతి హక్కుల కోసం ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకొనివెళ్ళి పోరాడిన ఉద్యమ నేత, ప్రస్తుత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు. పవన్ ను పిఠాపురంలో ఓడించి తీరుతానని.. తాను ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే నా ఇంటిపేరు మార్చుకుంటున్నా ’’ అంటూ ప్రకటన చేశారు. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్పు కోసం గెజిట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నానని తెలిపారు. ఇవిగో గెజిట్ కోసం దరఖాస్తు చేసుకున్న పత్రాలు అంటూ ఆయన మీడియాకు చూపించారు. ఈ మేరకు ముద్రగడ పద్మనాభం బుధవారం ఒక వీడియో విడుదల చేశారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించలేనందుకు చింతిస్తున్నానని. సీఎం జగన్ పేద ప్రజల కోసం, వృద్దులకు, రైతులకు పేద విద్యార్థులకు మహిళలకు చేసిన సంక్షేమానికి కృతజ్ఞతగా ప్రజలు జగన్ ప్రభుత్వానికి ఓటు వేయలేదని ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. దీంతో భవిష్యత్తులో ఏ ప్రభుత్వమూ సంక్షేమ పధకాలు ఇవ్వలేని అమలు చేయని పరిస్థితిని ఓటర్లు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
