సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో ఎవరు సాధించలేని విధంగా నరసాపురం పార్లమెంట్ కు కూటమి అభ్యర్థిగా 2లక్షల 76వేల 743 ఓట్ల రికార్డు మెజారిటీ తో ఎన్నికయిన బీజేపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ ను నేడు, బుధవారం ఆయన కార్యాలయంలో సిగ్మా ప్రసాద్ శుభాకాంక్షలు తెలియజెయ్యడం జరిగింది..ఒక సామాన్య కార్యకర్త నుండి జిల్లా నేతగా, తదుపరి రాష్ట్ర నేతగా ఇప్పడు ప్రజలు గెలిపించిన ఎంపీ గా ఎదిగిన ‘మా ఆత్మీయుడు’ వర్మ తో మన సిగ్మా సంస్థ తో గత 2 దశాబ్దాలు పైగా ఉన్న అనుబంధం..( 6ఏళ్ళ క్రిందట మన ‘సిగ్మా తెలుగు డాట్. ఇన్ లైన్ న్యూస్’ కూడా శ్రీనివాస వర్మ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు, రాష్ట్ర బీజేపీ సమావేశంలో ఎంపీ గంగరాజు, దగ్గుబాటి పురంధరేశ్వరి, మంత్రి మాణిక్యాలరావు లాంచ్ చెయ్యడం జరిగింది) గుర్తుకు తెచ్చుకోవడం జరిగింది. పెద్దలు వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి లను భీమవరం ఆహ్వానించినప్పుడు వాళ్లతో ప్రత్యక సిగ్మాలోకల్ ఛానెల్ ఇంటర్యూలు చేసే అవకాశం సిగ్మా న్యూస్ కు శ్రీనివాస వర్మ ఇప్పించారు. గతంలో 4 సార్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి బీజేపీ సమావేశాలు భీమవరం లో నిర్వహించినపుడు వర్మ సమర్ధత కు ప్రత్యక్ష సాక్షి మన సిగ్మా.. గతంలో భీమవరం మునిసిపల్ కౌన్సిల్ లో ప్యానల్ స్పీకర్ పదవి గౌరవం ఆయనకు దక్కింది. కౌన్సిల్లో పట్టణ సమస్యలపై రాజకీయాలకు అతీతంగా తనదయిన నిలదీత ధోరణి ఉండేది.. పశ్చిమ గోదావరి జిల్లాలో, రాజకీయాలకు అతీతంగా అందరు అభిమానించే బీజేపీ వర్మగా కేంద్ర స్థాయిలో తన పరిచయాలతో మరింత రాణించాలని ప్రధాని మోడీ మంత్రి వర్గంలో కీలక శాఖలో మంత్రిగా కొలువురు తీరి జిల్లా అభివృద్ధి కి ‘ఐకాన్‘ గా బీజేపీ వర్మ ప్రజల ఆకాంక్షలు నిజం చెయ్యాలని కోరుతూ.. మీ.. సిగ్మా ప్రసాద్.. MA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *