సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు (88) అస్తమయంపై పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా భీమవరం పట్టణంలో పలువురు ప్రముఖులు సంస్థలు తీవ్ర సంతాపం వ్యక్తం చేసాయి. మన సిగ్మా న్యూస్ కూడా.. రామోజీరావు లాంటి క్రమశిక్షణ పరుడు, ఉన్నత లక్ష్యసాధనలు కు బాటలు వేసిన మేధావికి ఘన నివాళ్లు అర్పిస్తున్నాము. సిగ్మా నెట్ వర్క్ ద్వారా గతంలో మాకు స్వయంగా ఈటీవీ ఛానెల్స్ తో ఉన్న మంచి అనుబంధం, ఆయన ఆతిధ్యాలు గురుకొస్తున్నాయి.ఇక భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సంతాప సభలో పాల్గొని ( ఫై ఫొటోలో) మహోన్నత వ్యక్తి , తెలుగువారు గర్వించే ఈనాడు సంస్థలు, రామోజీ ఫిల్మ్ సిటీ వంటి నిర్మాణం ఆయన అభిరుచికి నిదర్సనం అన్నారు. ఇంకా పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించి తెలుగు పత్రికా రంగానికి, తెలుగు భాష అభివృద్ధికి రామోజీరావు చేసిన కృషి వలనే ఈ రంగంలో లక్షల మంది ఉపాధి పొందుతున్నారని పలువురు సీనియర్ జర్నలిస్టులు పేర్కొన్నారు. భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతితెలిపారు. ఉండి ఎమెల్య రఘురామా కృష్ణంరాజు స్వయంగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి నివాళ్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.
