సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి ఆదివారం రాత్రి 07:15 గంటలకు మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణం చెయ్యనున్నారు. ఆయన కేబినెట్‌లో ఎవరెవరిని తీసుకోవాలనే దానిపై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇప్పటికే ఢిల్లీ నుండి సంబంధిత ఎంపీలకు ఢిల్లీ పీఎంవో నుంచి ఫోన్ కాల్ లు వచ్చేసాయి. కీలక సమయంలో ఎన్డీయే కూటమికి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువ ఎంపీలను అందించినప్పటికీ ఈసారి కూడా తెలుగు రాష్ట్రాల నుండి చెరో వైపు నుండి ఇద్దరు ఇద్దరు చప్పున మాత్రమే ప్రస్తుతానికి ప్రమాణ స్వీకారానికి పిలుపు వచ్చింది. తెలంగాణ నుంచి బీజేపీ కి చెందిన ఇద్దరు ఎంపీలు, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు కేబినెట్‌లో చోటు కల్పిస్తున్నారు. ఇప్పటికే వారు ప్రధాని నివాసానికి చేరుకొన్నారు. ఇక ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు పదవులు ఖాయం అయ్యాయి. తెలుగు హిందీ ఇంగ్లిష్ బాషలలో మంచి వక్త అయిన రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలుపుసాధించారు. తొలిసారి పోటీ చేసి గుంటూరు ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌ను కేంద్ర మంత్రి పదవి వరిస్తుండటం విశేషం. నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మ కు కూడా మంత్రి వర్గంలో స్తానం ఉంటుందని భావిస్తున్నారు. ఇక జనసేన, ఎంపీలకు తరువాత విస్తరణలో ఒకొక్కరి చప్పున ఏమైనా అవకాశం కల్పించవచ్చు..
