సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో ప్రఖ్యాత విద్యాసంస్థ డి ఎన్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం చెందిన డా. కే. వేణు గోపాల్ కు ఆంధ్ర విశ్వ విద్యాలయం నుంచి డాక్టరేట్ అంజేసిందని కళాశాల ప్రిన్సిపాల్ డా .యం. అంజాన్ కుమార్ తెలిపారు.. డా. కే. వేణు గోపాల్, డిజైన్ ఆండ్ ఎనాలిసిస్ అఫ్ మ్యూచువల్ కప్లింగ్ రిడక్షన్ ఇన్ మైమో యాంటెన్నాస్ అనే అంశం పై పరిశోధనలకు గాను డాక్టరేట్ ప్రధానం చేసారని అన్నారు . డా. కే. వేణు గోపాల్ ను కళాశాలఅధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు మరియు కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) లు అభినందించారు ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ.. డి ఎన్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు మరియు డాక్టరేట్ కోసం పరిశోధనలు చేస్తున్న అధ్యాపకులకు ఎల్లవేళలా ప్రోత్సాహం ఉంటుందని, ఇటువంటి అత్యంత అనుభవజ్ఞులైన మరియుడాక్టరేట్ పొందిన అధ్యాపకులతో తమ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యను విద్యార్థులకు బోధిస్తున్నామని అన్నారు.
