సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం డా. బి.వి. రాజు ఫౌండేషన్ మరియు విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జాతీయ సేవా పథకం (NSS) ఆధ్వర్యంలో నేడు, శుక్రవారం ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మంగం వేణు మాట్లాడుతూ.. యోగా యొక్క విస్తృతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యం అన్నారు. యోగాతో ఎన్నో ప్రయోజనాలున్నాయి అని, శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు యొక్క సమగ్ర విధానాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం చక్కటి వేదికగా పనిచేస్తుంది అని అన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులతో యోగాసనాలు వేయించారు. అనంతరం విద్యార్థులకు “జీవితంలో యోగా పాత్ర” అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు కళాశాల ప్రిన్సిపాల్ చేతులు మీదగా బహుమతులు ప్రదానం చేసారు.ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డా. దశిక సూర్యనారాయణ, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీ లక్ష్మి, వివిధ విభాగాధిపతులు, విద్యార్ధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
