సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత 18వ లోక్‌సభ స్పీకర్ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ఓం బిర్లా విజయం సాధించారు. నేడు, బుధవారం లోక్ సభలో జరిగిన ఓటింగ్లో బిర్లా కాంగ్రెస్‌కు చెందిన కె సురేష్‌తో పోటీ పడి గెలుపొందారు. లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లాను ఎన్నుకోవాలన్న ప్రతిపాదన మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. అనుకున్నట్లు గానే వైసీపీ కూడా ఆయనకు మద్దతు ప్రకటించింది. గతంలో ఓం బిర్లా 17వ లోక్‌సభలో స్పీకర్ పదవిని కూడా నిర్వహించారు. ఆ సమయంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్డీయే ఈసారి కూడా ఆయనను అభ్యర్థిగా నిలబెట్టింది. రాజస్థాన్‌లోని కోట బుండి స్థానం నుంచి ఆయన మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఎంపీ కూడా వరుసగా రెండు సార్లు స్పీకర్‌గా వ్యవహరించలేదు. లోక్ సభ సంఖ్యా బలం కారణంగా ఆయన గెలుపు ఖాయమైంది. ఓం బిర్లా ఎం కామ్ వరకు విద్యను అభ్యసించారు. ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ అన్ని రాజకీయపార్టీల నేతలు బిర్లాను అభినందించారు.
