సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి జేష్ఠమాస జాతర మహోత్సవాలు జరుగుతున్నా నేపథ్యంలో రేపు గురువారం ( తేదీ 27) మద్యాహ్నం 12 గంటల నుండి శ్రీ అమ్మవారి నగరోత్సవం ఘనంగా నిర్వహించడానికి స్థానిక నీరుల్లి కూరగాయ వర్తకసంఘం, ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర దేవాదాయ సహకారంతో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. .శ్రీ అమ్మవారి నగర ఊరేగింపులో బాణాసంచా కాల్పులు,తీన్మార్ వాయిద్యాలు, గరగల నృత్యాలు, కోలాటాలు ,శక్తి వేషాలు తో సందడిగా ఉంటుంది. ఆలయ ఆవరణ లో లైటింగ్, పుష్ప అలంకరణలు, తెలుగు రాష్ట్రాల నుండి పేరుపొందిన వందలాది కళాకారులతో కళాప్రదర్శనలు కోసం పలు స్టేజీల ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం .. సాయంత్రం నుండి రాత్రి 10 గంటల వరకు ఆలయ ఆవరణలో కళాకారులతో గొప్ప ప్రదర్శనలు.. బేతాళ నృత్యాలు, శక్తి వేషాలు, బుట్టబొమ్మలు, డప్పుల బృందాలు.. ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ జాతరకు అందరు ఆహ్వానితులే.. up file photo
