సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో పట్టణంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కల్కి విడుదల సందర్భముగా పట్టణం అంతా ఆయన అభిమానుల సందడి తో పండుగ వాతావరణం నెలకొంది. ప్రభాస్ సొంత ప్రాంతం కావడం తో ఎప్పుడు ఆయన సినిమాలకు దేశం అంతా ఒక ఎత్తు అయితే భీమవరం మాత్రం వీర లెవెల్ లో సందడి ఉంటుంది అని అందరికి తెలిసిందే.. లక్షలాది రూపాయల ఖర్చుతో పట్టణం అన్ని ప్రధాన సెంటర్ లలో అపార్ట్మెంట్స్ పైన , జేపీ రోడ్డు శివారు, విజయలక్ష్మి థియేటర్స్ వద్ద రైల్వే అండర్ టర్నల్ వద్ధ ప్రకాశం చౌక్ సెంటర్ దుర్గాపురం వైపు ఒక రేంజ్ లో ప్రభాస్ కల్కి గెటప్ లలో అందమైన భారీ ఫ్లెక్సీ లు స్వాగత ద్వారాలతో జెండాలాల్తో ఎక్కడ చుసిన సందడే సందడి.. ఇక రీల్స్ కోసం డ్రోన్ కెమెరాతో విదేశీ కార్ల తో కల్కి టైటిల్ డిజైన్ షూట్లు, బైక్ ర్యాలీలు తీన్మార్ దప్పుల చప్పుళ్లు తో ప్రభాస్ అభిమానులు చేసే సందడి కి అంతులేకుండా పోయింది. ఇక రేపు తెల్లవారు జాము 4గంటల నుండి భీమవరం 11 సినిమా హాళ్ళలో కల్కి ప్రదర్శన జాతర మొదలుతుంది. రేపు ఒక్కరోజు సుమారు 66 ఆటలు ప్రదర్శించే అవకాశం ఉంది. గతంలో బాహుబలి సినిమా ఎక్కువ థియేటర్స్ ఉన్న ఆ రోజులలో మొదటి రోజు 15 థియేటర్స్ లో 97 షోలు లు ప్రదర్శించడం ఒక్క రోజులో 1కోటి 7 లక్షల గ్రాస్ కలెక్షన్ సాధించడం గమనార్హం. ఇక ఆ రికార్డు ను ఎవరు కడపలేదు. భీమవరం బ్రాండ్ ప్రభాస్ అంటే ప్రపంచం మొత్తం భీమవరం వైపు చూడవలసిందే.. స్థానిక విజయలక్ష్మి థియేటర్ కల్కి 3డీ సినిమా కోసం ఆధునిక హంగులతో పాటు కొత్త సిట్టింగ్ ఏర్పాటు చేసారు.కల్కి ఘనవిజయం సాధించాలని కోరుకొందాం..
