సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం ప్రపంచ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా మాదక ద్రవ్యాలను వ్యతిరేకిస్తూ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా అంజి బాబు మాట్లాడుతూ.. సమాజంలో యువత డ్రగ్స్ గంజాయి లాంటి మాదకద్రవ్యాలకు బానిసలు కాకుండా వారి భవిషత్తు ను చక్కగా తీర్చిదిద్దుకోవాలని , క్షణిక ఆనందం కోసం మత్తు మందు అలవాటు చేసుకొంటే అది వారిని సర్వనాశం చేస్తుంది అని .. అలాగే ఈ మాదక ద్రవ్యాలు వాడుతున్న వారిపై, వాటి అమ్మకాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, రంగ సాయి, కేసీఆర్ కాలేజ్ బి ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు తో రంగ సాయి ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలకి దూరంగా ఉంటామని ప్రమాణం చేశారు.
