సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) మాజీ మునిసిపల్ చైర్మెన్ కొటికలపూడి గోవిందరావుతో కలసి నేడు, శుక్రవారం కమిషనర్ ఎం శ్యామల అడ్జక్షతన ఏర్పాటు చేసిన అన్ని మునిసిపల్ శాఖల అధికారుల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. పట్టణం లో శుభ్రత , మంచినీటి నీరు సరఫరా, కనీస సౌకర్యాలు, ప్రజల ఆరోగ్యం,ఫై అధికారులు శ్రద్ద పెట్టాలని, 300 మంది పైగా పరిశ్రుద్ద పనివారు పనిచేస్తున్నారని పట్టణంలో రోడ్లపై చెత్త కనిపించకూడదని, అవసరమైతే ప్రజలకు అవగాహన కల్పించాలని, రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా విధించాలని, పరిశుభ్రమైన భీమవరంగా చేసుకుందామని అన్నారు. ముఖ్యముగా టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టణంలో 20 ఏళ్ళ తరువాత పెరిగే జనాభా వారికి రోడ్డులు సౌకర్యాలు దూరదృష్టితో పెట్టుకొని పెరుగుతున్న కొత్త పట్టణంలోనైనా ఇంటి ముందు 10 అడుగుల ఖాళీ స్థలం ఉండేలా కచ్చితమైన ప్లాన్ ఉంటేనే అనుమతులు ఇవ్వలని ఆదేశాలు ఆదేశించారు.. భీమవరం పట్టణం ఇంకా మున్సిపల్ కార్పొరేషన్ అవ్వాల్సిందేనని, విలీనంకు 4సరిహద్దు గ్రామాలకు ఉన్న అభ్యంతరాలను తొలగిస్తామని రాయలం, చిన అమీరంలో ఉన్న కోర్టు కేసులను తొలగిస్తామని, అలాగే తాడేరు, కొవ్వాడ అన్నవరం ను కలిపి మున్సిపల్ కార్పొరేషన్ చేయడానికి అన్ని అడ్డంకులను తొలగిస్తామని అన్నారు. పట్టణంలోని ప్రతి సమస్య పరిష్కరానికి ఆయన 3 లేక 6 నెలల సమయం కేటాయించడం విశేషం. మునిసిపల్ అదికారులు నుండి పూర్తీ సమాచారం తో పాటు ఆస్తి , కుళాయి పన్నుల వసూళ్ల బకాయిలు 70 శాతం 80 శాతం వసూళ్లు కాదని ప్రజలు నుండి 100 శాతం పన్నుల త్వరితంగా వసూళ్లు చెయ్యాలని ఆదేశాలు జారీ చేసారు. మునిసిపల్ కంప్లెక్ లలో కొందరు 25 లక్షలు కూడా బకాయిలు ఉన్నారని వారి నుండి 3 నెలలు లో బకాయి వసూళ్ల చెయ్యాలని లేదా ఖాళీ చేయించాలని బ్యాంకు గ్యారంటీ లేకుండా ఎవరికి మునిసిపల్ షాపులు అద్దెకు ఇవ్వకూడదని ఆదేశించారు. ఇప్పటికే ఇచ్చేసిన 2వేల ఇళ్లతో సహా వచ్చే డిసెంబర్ కల్లా తాడేరు లోని మొత్తం 8500 పేదల టీడికో గృహాలను పూర్తీ చేసి ఇల్లు లేని పేదలకు అందివ్వాలని, అక్కడ మినీ భీమవరం లా సుమారు 40 వేల జనాభా ఉంటారు కాబ్బటి గునుపూడి నుండి తాడేరు కు 60 అడుగుల రోడ్డు ఏర్పాటు చెయ్యడం లక్ష్యంగా పనిచెయ్యాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *