సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోరటం తో పాటు ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు నూతన వరవడి లో దాతల నుండి నిధులు సేకరిస్తున్నారు. ఆ సేకరించిన డబ్బు తో ఉండి నియోజకవర్గంలో చేప్పట్టిన అభివృద్ధి కార్యక్రమానికి సంబంధిత దాత పేరు పెడతానని ఇప్పటికే ప్రకటించారు. ఈ ప్రకటనతో స్థానికులతో పాటు బయట ప్రాంతాల నుండి కూడా దాతల లక్షలాది రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. వాటితో ఇప్పటికే పంటకాలువలు మట్టిపూడికలు తీసి వాటి ఆధునికరణ పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు రావు రమేష్ ఇటీవల 3 లక్షల రూపాయలు ఉండి నియోజకవర్గ అభివృద్ధి కి విరాళంగా అందించారని.. ఆ చెక్ అందుకొంటున్న ఫొటోను రఘురామా తాజగా మీడియాకు విడుదల చేసి రావు రమేష్ కు కృతజ్ఞలు తెలిపారు.
