సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నీట్ పరీక్షల నిర్వహణ ఫై అనేక అనుమానాలకు రుజువులు దొరికిన నేపథ్యంలో నీట్ నిర్వహణ ఫై ప్రభుత్వ వైఖరి ని నిరసిస్తూ పార్లమెంట్ సమావేశాలలో నేడు 6వ రోజు ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు పోరు ఉదృతం చేసారు. నీట్‌పై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ .. స్పీకర్ సమ్మతించకపోవడం తో నిరసనగా ప్రతిపక్ష నేతగా ఎంపికయిన రాహుల్ గాంధి నేతృత్వంలో ప్రతిపక్షాలు సభ నుండి వాకౌట్ చేశాయి. ఇదిలా ఉండగా.. నేడు, సోమవారం 1,563 మంది విద్యార్థులకు మళ్లీ నిర్వహించిన నీట్ యుజి పరీక్షా ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్‌టిఎ) తాజాగా నేడు, సోమవారం ప్రకటించింది. అభ్యర్థుల ర్యాంకుల జాబితాను కూడా సవరించినట్లు తెలిపింది. గ్రేస్ మార్కులు పొందిన అభ్యర్థులకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూన్ 23న మరోసారి పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 1,563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించగా.. 813 మంది మాత్రమే హాజరయ్యారు. 750 మంది గైర్హాజరైనట్లు ఎన్‌టిఎ అధికారులు వెల్లడించారు. ఈ పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీని నీట్ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. మొదటి ర్యాంకు పొందిన అభ్యర్థుల సంఖ్య 67 నుండి 61కి తగ్గింది. త్వరలోనే నీట్ కౌన్సెలింగ్ జరగనుంది.
