సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బ్రిటీష్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన స్వరాజ్య సంగ్రామ యోధుడు, తెలుగు జాతి గౌరవాన్ని ఇనుమడింప చేసిన విప్లవకారుడు, మన్యం ప్రజల కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా విడిచిపెట్టిన త్యాగధనుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన స్వస్థలం భీమవరం ప్రాంతంలోని , మోగల్లు గ్రామం లోను వాడవాడ లా ఉన్న అల్లూరి విగ్రహాలకు స్థానికులు పూలమాలలు వేసి ఘన నివాళ్లు అర్పిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , నరసాపురం ఎంపీ , కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మరియు ఇతర MP లతో కలిసి న్యూఢిల్లీ లో ఆ మహనీయుని చిత్రపటానికి నివాళులు అర్పించడమైనది. సీతారామరాజు గారి దేశభక్తి, తెగువ, ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.
