సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలన్నీ అక్రమంగా నిర్మించారని వాటిని కూల్చివేసే దిశగా ఇప్పటికే అడుగులు వేసిన చంద్రబాబు ఆద్వర్యంలోని కూటమి ప్రభుత్వం హైకోర్టు కోర్ట్ నిబంధనలు అతిక్రమించి కక్ష తో కార్యాలయాల కూల్చివేతలు పాల్బడుతుందని దీనిఫై చర్యలు తీసుకోవాలని హైకోర్టు కు వెళ్లిన వైసీపీ నేతలకు నేడు గురువారం హైకోర్టు తీర్పు తో భారీ ఊరట లబించించింది. దీనిపై హైకోర్టు చంద్రబాబు సర్కార్ కు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వైసీపీ ఆఫీస్‌ల విషయంలో చట్ట నిబంధనలు అనుసరించాలని ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది.తగినంత సమయం ఇచ్చి వివరణ తీసుకున్నాక కట్టడాల విషయంలో తగిన చర్యలు తీసుకోవాని కోర్టు ఆదేశించడం జరిగింది. ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా, ప్రమాదకరంగా ఉంటే తప్ప భవనాల కూల్చివేత వంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఏపీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2 నెలల్లో భవనాల అనుమతులు, ఆధారాలు, రికార్డులు అధికారుల ముందు ఉంచాలని వైసీపీని న్యాయస్థానం ఆదేశించింది.దీంతో ఈ వ్యాజ్యాలపై విచారణను ఏపీ హైకోర్టు మూసివేసింది.
