సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నేడు, గురువారం ఉదయం విద్య సంస్థల బంద్ విజయవంతం అయ్యింది. ..తక్షణం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నీట్ అవకతవకలపై దర్యాప్తు నిర్వహించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని , నీట్ పరీక్షలను రద్దుచేసి మరలా పరీక్ష నిర్వహించాలని దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని ఇదే క్రమంలో( ఎన్ టి ఏ) ను రద్దు చేయాలని జరిగిన దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ లో భాగంగా జిల్లాలో SFI , ఏ ఐ ఎస్ ఎఫ్ , పి డి యస్ యు తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన కేజి టు పీజీ విద్యా సంస్థల బంద్ విజయవంతం అయిందని .ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి టి ప్రసాద్ , ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి టి అప్పలస్వామి , పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి పి నాగరాజు లు తెలిపారు జిల్లా కేంద్రం భీమవరంలో విద్యార్థి నాయకులు పలు ప్రైవేట్ ,కార్పొరేట్, ప్రభుత్వ విద్యాసంస్థలను మూయించి వేశారు అనంతరం ప్రకాశం చౌక్ వద్ద నాయకులు నిరసన తెలియజేసారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి ప్రసాద్ , ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి టి అప్పలస్వామి , పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి పి నాగరాజు లు ఇతర నేతలు విద్యార్థులు పాల్గొన్నారు.
