సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రజలు సంక్రమిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పెంపుడు జంతువుల యజమానులు తప్పనిసరిగా టీకా మందును ఇప్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. జూనోసిస్ డే సందర్భంగా భీమవరంలోని పశువుల ఆసుపత్రిలో ఉచిత యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ పెంపుడు జంతువులకు వ్యాధులు సోకకుండా రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు ఉపయోగపడతాయని అన్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ .. కుక్కలకు వారానికి ఒకసారి స్నానం చేయించాలని, ప్రతీ ఒక్కరూ తమ పెంపుడు జంతువులకు. టీకాలు వేయించాలని, జాగ్రత్తలు ఎంతో అవసరమని అన్నారు. మున్సిపల్ కమిషనర్ ఏం శ్యామల మాట్లాడుతూ త్వరలో కుక్కలకు కుటుంబ నియంత్రణ శాస్త్ర చికిత్సలు ప్రారంభిస్తామని అన్నారు. అనంతరం 252 కుక్కలకు రేబిస్ వ్యాధి నివారణ టికాలను వేసినట్లు పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డా పి సుదీర్ బాబు తెలిపారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా బహుమతులు ప్రశంసా పత్రాలను అందించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా డి మహేశ్వరరావు, జిల్లా జాయింట్ డైరెక్టర్ డా మురళీ కృష్ణ, డిప్యూటీ డైరెక్టర్ డా జవార్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.
