సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరం గునుపూడిలోని నల్లం వారి కళ్యాణ మండపంలో నల్లం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుకు గత ఆదివారం రాత్రి ఘనంగా ఆత్మీయ పౌర సత్కారం చేశారు. దీనికి విశేష సంఖ్యలో భీమవరం పురప్రముఖులు హాజరు అయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. తాను ఎంత ఎదిగిన ఈ భీమవరం బిడ్డనే అని ఇక్కడ అందరు ప్రజలు తనకు ఆత్మీయులే నని , నన్ను ఎన్నుకున్న నరసాపురం పార్లమెంట్ ప్రజానీకానికి రుణపడి ఉంటానని కేంద్ర ప్రభుత్వ సహకారంతో నా శక్తి మేర ఈ ప్రాంత ప్రజల అభివృధికి కృషి చేస్తానని ప్రకటించారు. ఎమెల్య అంజిబాబు మాట్లాడుతూ.. భీమవరం ఎంతో అభివృద్ధి చెందుతున్న పట్టణమని,విద్యారంగం , వ్యాపార రంగం, ఆక్వా రంగంలో దూసుకొనిపోతుందని . మరి ఈ ప్రాంత ప్రజల అవసరాల కోసం ,భీమవరంకు ఎయిర్ పోర్ట్ తీసుకుని రావాలని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ను కోరుతున్నానని, ల్యాండ్ సదుపాయాన్నిదానికి కావలసిన స్థలం ను మేము సమకూరుస్తామని, అనుమతి తీసుకుని రావాలని సంచలన ప్రకటన చేసారు. భీమవరం నుంచి ఎంతో మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారని, డొమెస్టిక్ ప్లైట్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర సహాయ మంత్రి వర్మ ను కోరారు. ( ప్రస్తుతం కేంద్రంలో విమానయాన శాఖ మంత్రి గా టీడీపీ చెందిన రామ్మోహననాయుడు ఉన్నారు.. గతంలో అశోక గజపతి రాజు కూడా ఇదే శాఖ మంత్రిగా పనిచెయ్యడం గమనార్హం)భీమవరంకు మాస్టర్ రింగ్ రోడ్డు కూడా ఏర్పాటు చేసుకుందామని, వీటికి కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం ఎంతో అవసరమని అన్నారు. తాను తమ అధినేత పవన్ సహకారంతో భీమవరం కు డంపింగ్ యార్డ్ సిద్ధం చేస్తానని అన్నారు.
