సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వినాయక చవితి పండుగ వచ్చే సెప్టెంబర్ 7న పండుగ వస్తున్నా నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ లో గణేష్ పందిళ్ళ వేడుకలు విగ్రహాలు ఏ రేంజ్ లో ఉంటాయో అందరికి తెలిసిందే.. అందుకే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలకు నేడు, సోమవారం కీలక సూచన చేశారు. పర్యావరణ హితంగా వినాయక చవితి నిర్వహించుకోవాలని వినాయక చవితిని మట్టి వినాయకులే పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు. ప్లాస్టర్ అఫ్ పారిస్ తో నిర్మించే విగ్రహాలు, ఇంకా ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించేలా అవగాహన కల్పించాలని కోరారు. కాగా పిఠాపురంలో మట్టి వినాయకుని విగ్రహాలతో పూజలు జరిపేలా ఏర్పాటు చేయాలని పవన్ నిర్ణయించారు.దేవాలయాల్లో ప్రసాదాన్ని బటర్ పేపరుతో చేసిన కవర్లతో ఇవ్వడం సరికాదు. ప్రసాదాలను ప్లాస్టిర్ కవర్లల్లో కాకుండా తాటాకు బుట్టలు, ఆకుల దొన్నెలను వాడాలి. ఈ తరహా ప్రయోగం పిఠాపురం ఆలయాల్లో ప్రయోగత్మాకంగా చేపడతాం’’ అని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అన్నారు.
