సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ఈనెల 15 వ తేదీ సోమవారం.. మధ్యాహ్నం 2 గంటల నుండి.. హరేరామ- హరే కృష్ణ.. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ ఆధ్వర్యంలో ‘శ్రీ జగన్నాధుని రధోత్సవం’ కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక వన్ టౌన్ లోని గునుపూడి పంచారామ క్షేత్రం నుండి 2 టౌన్ లోని ఏ ఎస్ ఆర్ కాలనీ లోని ఇస్కాన్ ఆశ్రమం వరకు ఈ రథయాత్ర నిర్వహిస్తున్నట్లు సుమారు 4 కిలోమీటర్లు మేర రధం లాగుతూ హరే రామ హరే కృష్ణ నామ సంకీర్తనలతో భక్తులు తరించాలని, తదుపరి సాయంత్రం నుండి శ్రీ కృష్ణ ప్రవచనాలు ప్రసాద వితరణలు ఉంటాయని పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని ఇస్కాన్ ప్రతినిధులు పేర్కొన్నారు.
