సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజక పరిధిలో పలు ప్రాంతాలలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి గారి 75 వ జన్మదిన వేడుకలు లో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు పాల్గొన్నారు. వాడవాడలా ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు. ముఖ్యంగా గునుపూడి లో ఆయన ఆధ్వర్యంలోనే జన్మదిన వేడుకలు పేదలకు వస్త్రదానం, అన్నసమారాధన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కామన నాగేశ్వరరావు , శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్, మానేపల్లి నాగన్న బాబు YSRCP పట్టణ అధ్యక్షులు తోట బోగయ్య , భీమవరం మండల ZPTC కాండ్రేగుల నర్సింహ రావు ,మాజీ కౌన్సిలర్లు కోడె యుగంధర్, జంగం మాణిక్యాల రావు,శ్రీమతి పాలవెల్లి మంగ , నల్లం రాంబాబు, జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ పెనుమాల నర్సింహ స్వామి,YSRCP సేవాదళ్ జిల్లా అధ్యక్షులు బలే ఏసుబాబు , గొల్లవానితిప్ప మాజీ సర్పంచ్ బోకూరి విజయ రాజు , YSRCP నాయకులు పాలపర్తి జోనా , నూకల జగన్ , తాడేరు గణేష్ , తదితరుల పాల్గొన్నారు. అయితే కారణాలు ఏవైనా మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వై ఎస్ జన్మదిన వేడుకలలో పాల్గొనక పోవడం నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలలో చర్చకు దారి తీసింది.
