సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యువ హీరో సుధీర్ బాబు ఈ ఏడాది గత నెలలో హరోంహర వంటి మంచి సినిమాతో సైలెంట్ హిట్ అందుకొన్నాడు. ‘ది రివోల్ట్’ అన్నది ఈ మూవీ క్యాప్షన్. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాళవికా శర్మ హీరోయిన్‌గా నటించింది. సునీల్, అక్షరా గౌడ ప్రధాన పాత్రలు పోషించారు. కేజీఎఫ్, పుష్పల స్టైల్ లో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సినిమాగా హరోంహర రూపొందింది. టీజర్స్, ట్రైలర్స్ కొత్తగా ఉండడం, ప్రమోషన్స్ కూడా గట్టిగా నిర్వహించడంతో సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. మంచి టేకింగ్ కధనం తో సినిమా కూడా యూత్ ను అకట్టుకొంది ఇప్పుడు హరోంహర సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సుధీర్ బాబు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. మరో 2 రోజులు.. అంటే.. జులై 11 నుంచి హరోంహర సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా.
