సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ నేడు, మంగళవారం ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఏపీ రాజకీయాలపై స్పందిస్తూ.. జగన్ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినా ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అక్కడ ఎదో జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు మంచి చేసిన వ్యక్తులు ఎంతో మంది ఓడిపోవడం విచిత్రమనిపించిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వైసీపీ ఓటమి చెందినా.. ఏ పొత్తు లేకుండా ఏపీ లో సింగిల్ పార్టీగా 40 శాతం ఓట్లు రావడం సాధారణ విషయం కాదన్నారు. 40శాతం మంది ఏపీ ఓటర్లు జగన్‌తోనే ఉన్నారని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ తరపున బరిలో దిగిన షర్మిలకు నాయకత్వ లక్షణాలు లేవన్నారు. కేవలం జగన్‌ను ఓడించడానికి షర్మిలను కాంగ్రెస్ పావులా వాడుకున్నారని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమితో జతకట్టడం వలన ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. ఎప్పుడూ ప్రజల్లో ఉండే కేతిరెడ్డి ధర్మవరంలో ఓడిపోవడం ఏమిటో? అక్కడ ఎవరికీ తెలియని బీజేపీ అభ్యర్థి గెలవడం ఏమిటో? అర్ధం కావడంలేదన్నారు. ఏపీ ఫలితాలు మాత్రం తనను షాక్‌కు గురిచేశాయని చెప్పారు. తెలంగాణలో తమ BRS పార్టీ ఒక్క సీటు గెలవలేకపోవడం కూడా కేటీఆర్ స్పందించారు. తమ ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయన్నారు. తాము ప్రజలతో కలవకపోవడం వలన తాము తెలంగాణలో ఓడిపోయామని కేటీఆర్ చెప్పారు
