సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజాగా నేడు, మంగళవారం నోట్ల రద్దు గురించి ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఎస్‌ఎల్‌బీసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్తూ బకాయిలపై శ్వేతపత్రం విడుదల చేశారు. విద్యుత్ సంస్థలకు రూ.1 లక్షా 29 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని ప్రకటించారు. అహంకారం ఉన్న వ్యక్తి అధికారంలో ఉంటే ఏమవుతుందనేది ఈ లెక్కలను చూస్తే అర్థమవుతోందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నారు ఇదే సందర్భములో చంద్రబాబు మాట్లాడుతూ.. కొందరు గత ఐదేళ్లలో కొట్టేసిన సొమ్ముతో వ్యవస్థను కొనుగోలు చేయాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. వీరి అవినీతిని అరికట్టాలంటే రూ.500, రూ.200 నోట్లు రద్దు చేసి డిజిటల్ కరెన్సీ తీసుకురావాలని చంద్రబాబు కోరారు.
