సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నందు గల డిజిటల్ అసిస్టెంట్స్ అందరూ నేడు, మంగళవారం ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో సచివాలయం నందు డిజిటల్ అసిస్టెంట్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రమోషన్ చానల్,పే స్కేల్ గురించి అన్నిటి కంటే ముఖ్యంగా వీరికి ఉన్న ఉన్నతమైన టెక్నికల్ క్వాలిఫికేషన్స్ దృష్ట్యా మన రాష్ట్రంలో గల 35 ప్రభుత్వ శాఖల నందు జూనియర్ అసిస్టెంట్ లు గా పదోన్నతి కల్పించాలని విన్నవించుకున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎంఎల్ఏ రఘురామా.. “డిజిటల్ అసిస్టెంట్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి తగిన న్యాయం జరిగే విధంగా కృషి చేస్తాను” అని హామీ ఇవ్వడం జరిగింది.
