సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో కొత్త విద్య సంవత్సరం ప్రారంభమయింది. చంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో ఇంట్లో పిల్లలు అందరికి అమ్మవడి , ఇంజనీరింగ్ స్థాయిలో ఉన్నత విద్య చదువుకొనే పేద విద్యార్థులకు గతంలో వలె పూర్తీ పీజు రియంబర్స్ మెంట్ చెల్లిస్తారా?లేక ఏమైనా మార్పులు చేస్తారా? అన్నదానిపై ఇంకా పూర్తీ క్లారిటీ రాలేదు. అయితే ఇటీవల ఒక్కసారిగా LKG నుండి డిగ్రీ, ఇంజనీరింగ్ వరకు దాదాపు అన్ని ప్రవేటు విద్యాసంస్థలలో పీజులు మాత్రం 10 నుండి 35 శాతం వరకు పెరిగిపోవడం విద్యార్థుల తల్లి తండ్రులలో ఆందోళన రేకెత్తిస్తుంది. అయితే టాప్ గ్రేడ్ ఇంజనీరింగ్ కళాశాలలో అయితే గతంలో ఉన్న పీజులకన్నా సుమారు 30 శాతం పైగా పీజులు పెంపుదలకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి (ఎంసెట్ ద్వారా సిటు సాధించిన విద్యార్థికి సైతం ఏడాదికి 2 సెమిస్టెర్స్ పీజు సుమారు70 వేలు నుండి 1 లక్ష రూ. దాటేసింది. ఇక హాస్టల్ పీజులు అదనం). నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో పీజులు పెంచుతున్నట్లు యాజమాన్యాలు చెపుతున్నారు. మరి పెంచిన పీజులు పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో ప్రభుత్వం చెల్లిస్తుందా? లేక గతంలో జగన్ సర్కార్ కాలేజీలకు నిర్ణయించిన పీజులు మాత్రమే కొనసాగాలా? అన్నది కొత్త ప్రభుత్వం ఇంకా ఆదేశాలు ఇవ్వలేదు. అయితే ఇంజనీరింగ్ కళాశాలలలో సీట్లు పెంచుకోవచ్చునని మేనేజ్‌మెంట్ కోటాలో మాత్రం కళాశాలకు ఉన్న ఫీజు పెంచుకొని వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. మేనేజ్‌మెంట్ కోటాలో 30 శాతం సీట్లున్నాయి. దాంతో ఎంసెట్ లో సరిఅయిన ర్యాంకు రాక సొమ్ములు చెల్లించి చదువు కోవాలను కున్న విద్యార్థులకు కొంత ఇబ్బంది తప్పదు. ప్రధానంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువు పూర్తి చేయాలంటే టాప్ గ్రేడ్ ఇంజనీరింగ్ కళాశాలల్లో సగటున పెంచిన పీజులతో 18 _ రూ.20లక్షలు అయ్యే పరిస్థితి ఏర్పడింది. CS ఆ తర్వాత కొత్తగా AI కోర్స్ లకు ఈసీఈ కోర్సుకు డిమాండ్ ఉంది. ఇప్పటికే కౌన్సిలింగ్ లలో కంప్యూటర్ సైన్స్. టెక్నాలజీ ఆధారిత కోర్సుల సీట్లను ఇంజనీరింగ్ కళాశాలల్లో పెంచారు. గతంలో కాంగ్రెస్ ,తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో కస్టపడి చదివి 10 వేల ర్యాంకు వరకు సాధించిన టాప్ గ్రేడ్ విద్యార్థులకు మాత్రమే పూర్తి స్థాయిలో ప్రభుత్వమే ఫీజు చెల్లించేది. ఇదే తరహా విధానం మరల అమలులోకి వస్తుందని ప్రచారం కూడా జరుగుతుంది. ఏది ఏమైనా, ఏ పార్టీ పభుత్వం వచ్చిన పెంచిన పన్నులు కట్టడం తప్ప ప్రభుత్వ స్కీమ్స్ అందని మధ్యతరగతి పిల్లల తల్లి తండ్రుల కు మాత్రం మనోవ్యధ మిగులుతుంది. చంద్రబాబు సర్కార్ ఈ అనుమానాలను నివృత్తి చేస్తూ విద్యార్థులకు వారి తల్లి తండ్రులకు స్వష్టమైన వివరణతో కూడిన ప్రకటన అతి త్వరలో విడుదల చెయ్యవలసి ఉంది.
