సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే, పులపర్తి రామాంజనేయులు నేడు, బుధవారం భీమవరం పట్టణంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఒకటో పట్టణంలోని సింహాద్రి అప్పన గుడి రోడ్డులో జరుగుతున్న డ్రెయినేజీ కల్వర్టు నిర్మాణ పనులను ఎమ్మెల్యే అంజిబాబు పరిశీలించారు, అక్కడ నిల్వ ఉన్న మురుగునీరు, మట్టి గుట్టలు, చెత్త రోడ్డు మీద ఉండకూడదని, ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తాయని, వాహనదారులకు ఇబ్బంది అని ..వాటిని వెంటనే తొలగించాలని..డ్రైన్ నిర్మాణ పనులను శరవేగంగా జరపాలని అధికారులను ఆదేశించారు. భీమవరం ఎంతో అభివృద్ధి చెందుతుందని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చూస్తామని, అందరి సహకారం అవసరమని అన్నారు. ఎమెల్య అంజిబాబు నేటి సాయంత్రం 5గంటలకు జేపీ రోడ్డులోని గొట్టుముక్కల వారి తోట(గణేష్ క్యాంటీన్ వెనుక) శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం నందు వేద సభ లో పాల్గొంటారు.
