సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ రాజ్యసభ సభ్యులు వై వి సుబ్బారెడ్డి నేడు, బుధవారం ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధి కి ప్రత్యేక హోదా కావాల్సిందేనని, కేంద్రం లో ప్రధాని మోడీ ప్రభుత్వంలో బీజేపీ కి పూర్తీ బలం లేదని, ఇదే మంచి సమయం అని.. టీడీపీ వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రత్యేక హోదా సాధించాలని. ఇటీవల పులివెందుల అసెంబ్లీ కి . వైఎస్ జగన్ రాజీనామా చేస్తారంటూ ఎంపీ గా కడప నుండి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజంకాదని ఈ దుష్ప్ర చారాన్ని ఖండించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలే చూసుకొంటారని దీనికి పోయి కేంద్రంలో చక్రం త్రిప్పటానిక్ జగన్ రాజీనామా ఎందుకు చెయ్యాలి.?.రాజీనామా చేయరు.. చేయాల్సిన పనిలేదని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
