సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో 3 చోట్ల పేదలకు కేవలం 5 రూపాయలకు భోజనం పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో..బహుశా అగస్ట్ 15 నుండి ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో భీమవరానికి చెందిన ఎస్‌ఎల్‌వీ గ్రూప్ చైర్మన్ పెన్మత్స శ్రీనివాసరాజు కోటి రూపాయలు విరాళం చెక్ ను సీఎం చంద్రబాబు కి తాడేపల్లి లోని ఇస్కాన్ వారి గోకుల క్షేత్రం లో అందివ్వడం జరిగింది. అదేవిధంగా ఇస్కాన్ టెంపుల్ నిర్మాణానికి మరో కోటి ఎనిమిది లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అన్న క్యాంటీన్లకు కోటి రూపాయలు విరాళం ఇవ్వడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
