సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా లో అడ్జక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు, ఆదివారం పెన్సిల్వేనియాలోని బట్లర్ ప్రాంతంలో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా డోనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఓ ఆగంతకుడు ఎదురుగ ఉన్న బిల్డింగ్ పైకి ఎక్కి రివాల్వర్ తో కాల్పులకు తెగబడ్డాడు. ఆయన కదలటంతో నుదిటి కి గురితప్పి.. ట్రంప్ బుగ్గలమీదుగా చెవి పై నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆయనకు గాయమై రక్తస్రావం అయింది. వెంటనే ట్రంప్ చుట్టూ వలయంలా ఏర్పడిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయనను సురక్షితంగా కారు ఎక్కించి పంపించేశారు. అలాగే కాల్పులకు తెగబడిన దుండగుడిని చంపివేశారు. దుండగుడి కాల్పులలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. తనపై ఈ హత్య యత్న ఘటన గురించి డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన ప్రాణాలను కాపాడిన సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. గాడ్ బ్లెస్ అమెరికా
అంటూ ట్రంప్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాల్పులు జరిపినపుడు ఓ బుల్లెట్ తన చెవి పై నుంచి వెళ్లిందని తెలిపారు. ఈ ఘటనపై భారత ప్రధాని మోడీ.. మిత్రుడు ట్రంప్ ఫై హత్య యత్నం జరగటం తీవ్ర దిగ్బ్రాంతి కి గురిచేసిందని, ఇటువంటి దారుణ చర్యలను భారత్ ఖండిస్తోందన్నారు. అన్నారు.
