సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం ఏపీకి చెందిన కీలక నేతలు ముగ్గురు మూడు రాష్ట్రాలలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ లో పర్యటిస్తుండగా, మంత్రి నారా లోకేశ్ జైపూర్ కి చేరుకొన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ బెంగళూరుకి వెళ్లారు. చంద్రబాబు వెలగపూడి సెక్రటేరియట్ నుంచి హెలికాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. చంద్రబాబు నేడు శనివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ భేటీలో పాల్గొంటున్నారు . ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది.జైపూర్ వెళ్లడానికి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న లోకేశ్.. అక్కడ ప్రతి కార్యకర్తతోనూ లోకేశ్ ఫొటో దిగారు. అనంతరం ప్రత్యేక విమానంలో జైపూర్ వెళ్లారు.మాజీ సీఎం జగన్, భారతీ సమేతంగా . మొదట తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు అక్కడ విశేష స్థాయిలో కార్యకర్తలు జై జగన్.. జై జై జగన్..అంటూ నినాదాలు చేసారు. అక్కడ ఇండిగో విమానంలో బెంగళూరుకి బయలుదేరి వెళ్లారు.
