సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇప్పటికి తెలుగుసిని పరిశ్రమలో అగ్ర హీరోగా రాణిస్తున్న నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీకి జరిగిపోయింది. షాక్ ఏమిటంటే ఇప్పటికే ఎటువంటి హడావుడి లేకుండా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యిపోవడం. తన డెబ్యూ మూవీకి ఏకంగా హనుమాన్ వంటి బంపర్ హిట్ ఇచ్చిన .. పాన్ ఇండియా డైరెక్టర్, భీమవరం కుర్రాడు ప్రశాంత్ వర్మనే ఎంచుకున్నాడు మోక్షు. గతంలో చాలా బొద్దుగా కనిపించిన అతను తన మొదటి సినిమా కోసం స్లిమ్ గా, స్టైలిష్ గా తయారయ్యాడు. తన మేకోవర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడీ జూనియర్ బాలయ్య.. . తన స్టైలిష్ లుక్ కు సంబంధించిన ఫొటోలు షేర్ చేసిన మోక్షు.. ‘వస్తున్నా.. మీ అందరి ఆశీస్సులు కావాలి’ ఒక పోస్టు చేశాడు. అలాగే.. ‘ఊహించనిది ఊహించండి.. ప్రశాంత్‌ వర్మతో’ అని మరో ట్వీట్‌ చేశాడు. తాజాగా తన డెబ్యూ మూవీ లో తన సన్నివేశాలపై సినిమా షూట్ కూడా స్టార్ట్ పోయినట్లు ప్రకటించాడు. . ‘ఇంట్రడక్షన్ సీన్, స్టోరీ, ఎలివేషన్, హై మూమెంట్స్, అన్ని మీ అంచనాలను మించి ఉంటాయి’ అని ట్వీట్ చేశాడు మోక్షజ్ఞ. కాగా బాలకృష్ణ- ప్రశాంత్ వర్మల మధ్య మంచి అనుబంధం ఉంది. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన ఆహా అన్ స్టాపబుల్ షోకు ప్రశాంత్ వర్మనే డైరెక్టర్ గా వ్యవహరించారు. అందుకే బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతలను కూడా ప్రశాంత్ వర్మ కు అప్పజెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *